CTR: పీఎం కిసాన్ యోజన- అన్నదాత సుఖీభవ “రైతన్న మీకోసం” ఇంటింటి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సోమవారం కుచ్చివేడు గ్రామంలో పర్యటించారు. రైతుల ఇంటి వద్దకే వెళ్లి పలకరించారు. అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంకు ఖాతాలో పడ్డాయా అని ఆరా తీశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు ఉన్నారు.