TG: కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేళ్లయినా 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులకు రైతుభరోసా లేదు కానీ.. రాహుల్కు వెయ్యి కోట్లా? మహిళలకు రూ.2,500, పెన్షన్లు రూ.4,000 ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. మొదటి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు.