NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్‌ను బీసీ నాయకులు సందర్శించి సమస్యలపై మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సరైన సమయపాలన పాటించడం లేదని అన్నారు. మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, లేక రోగులు అవస్థలు పడుతున్నారన్నారు.