GDWL: క్షణికావేశంలో చేసే బెట్టింగ్‌లు మీ జీవితాలను చీకట్లోకి నెట్టేస్తాయి అని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐపీఎల్ సీజన్ సాకుతో వచ్చే బెట్టింగ్ యాప్స్, ఈజీ మనీ స్కీమ్స్‌పై పోలీసులు గట్టి నిఘా ఉంచారన్నారు. రిఫరల్ బోనస్ ఆశతో స్నేహితులను ఈ ఊబిలోకి లాగవద్దని, అక్రమ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠినమైన క్రిమినల్ కేసులు తప్పవన్నారు.