SRPT: నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రాపురంలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ ఉమా పిచ్చయ్య ప్రారంభించిన ఈ శిబిరంలో పశువైద్యాధికారులు డాక్టర్ బీ. అఖిల, డాక్టర్ ఎం. రవికుమార్ మొత్తం 52 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, చూడి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రలు, సిబ్బంది పాల్గొన్నారు.