BHPL: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం నివారించి రైతులకు న్యాయం చేయాలని రేగొండ మండల BJP అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో MROకు, BJP నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, గన్నీ బ్యాగులు, హమాలీలు అందుబాటులో ఉంచి ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.