ADB: ఉట్నూర్ మండలంలోని దంతనపల్లి ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ అంకవ్వ భూమన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు .