ASF: జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి నిర్వహించే మానవ హక్కుల షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మంగళవారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల వారు జూన్ 30లోపు తమ ఎంట్రీలను గూగుల్ డ్రైవ్ ద్వారా hhrcshortfilm@gmail.com పంపాలని సూచించారు. విజేతలకు రూ.2 లక్షల నగదు అందిస్తారన్నారు.