SRD: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మని కుంటలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం హనుమాన్ గీతా పారాయణం, బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.