NRML: బాసర ఐఐఐటీను మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సందర్శించారు. విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక బోధన పద్ధతులు అమలు చేసి, ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ క్యాంపస్లో వసతి, ఆహారం, త్రాగునీటి వంటి సదుపాయాలు మెరుగుపరచాలని తెలిపారు.