NLG: బోడుప్పల్‌లోని కేశవనగర్‌లో ఏర్పాటు చేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.