SDPT: వర్గల్ మండలం గౌరారం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండుకార్లు ఢీకొని నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనికి చెందిన ప్రసాద్ రాజ్, సుధారాణి, రాఘవేందర్, పెద్దపల్లికి చెందిన గురువారెడ్డిగా తెలిసింది. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు.