ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని జన్కపూర్లోశ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కలెక్టర్ కే. హరిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.