KMR: భిక్కనూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఆర్టీసీ డీలక్స్ బస్సు సాంకేతిక సమస్యతో అరగంట పాటు మొరాయించింది. KMR నుంచి JBS కు వెళ్తున్న నాన్‌స్టాప్ డీలక్స్ బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో ప్రయాణికులు కిందికి దిగి బస్సును ముందుకు తోసే పరిస్థితి ఏర్పడింది.