SRD: నారాయణఖేడ్ మండలం కంజీపూర్కు చెందిన నర్సమ్మకు మంజూరైన రూ. 31,000 CMRFచెక్కును ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం తన నివాసంలో అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ప్రభుత్వం ఈ సాయం అందించింది. పేదలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పండరెడ్డి, అశోక్, లక్ష్మణ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.