SRPT: కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ లేఖ హాస్పిటల్‌ను శుక్రవారం కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.