NZB: చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న పేర్కొన్నారు. సాలూరులో పంచాయతీ కార్యదర్శులకు బాల్య వివాహాల నిరోధక చట్టం-2006పై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.