KMM: ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గైనకాలజిస్ట్ డా.అపర్ణ, పిడియాట్రిషన్ డా.రాంబాబు, ఆప్తమాలజిస్ట్ డా.రాము నాయక్, ఆర్థోపెడిక్స్ డా.హనుమాన్, డెంటిస్ట్ డా.లావణ్య వంటి నిపుణులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందిస్తారన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.