WGL: చెన్నారావు పేట(M)లోని జీడిగడ్డ తండా గ్రామపంచాయతీలో డీఆర్డీవో పద్మజ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సర్పంచ్, ఉపాధి కూలీలతో సమావేశమై జీరో లేబర్ రిపోర్టుపై వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో పనులు ఎందుకు నిలిచిపోయాయో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వెంటనే ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పని కల్పించాలని అధికారులను డీఆర్డీఓ ఆదేశించారు.