NZB: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నవీపేట మండలం మోకన్ పల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ కవితతో పాటు, గెస్ట్ ఫ్యాకల్టీ రాజశ్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు వీరిరువురికి వేతనాలను నిలిపివేస్తూన్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.