PDPL: మంథని సమీపంలోని గోదావరి నది, సుందిళ్ల జలాశయం, గ్రామ శివారులో ఉన్న పుష్కర ఘాట్లను పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ ఏడాది జరిగే పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలకు సౌకర్యాలను ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. CC కెమెరాలు, ట్రాఫిక్ మళ్లింపు, భద్రత చర్యలపై అధికారులతో సమీక్షించారు.