SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు సోమవారం రాత్రి ఏకాంత సేవతో ముగిశాయి. రాత్రి ఏకాదశ ఆవరణలో భాగంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద పారాయణాలు, మౌన ప్రదక్షిణ గావించారు. అనంతరం రాత్రి 10:30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు. దీంతో ఈనెల 5వ తేదీ నుండి ఐదు రోజులపాటు నిర్వహించిన శివ కళ్యాణ ఉత్సవాలు ముగిశాయి.