WGL: నల్లబెల్లి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నుంచి గోదాములకు ధాన్యం తరలింపునకు లారీలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి ఆరోపించారు. టెండర్లు పిలిచినా అగ్రిమెంట్ ఇవ్వకపోవడంతో వాహనాలు రావడం లేదన్నారు. సమస్య పరిష్కరించాలని మంగళవారం కలెక్టరేట్లో డీఆర్వో విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.