NLG: కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో గాలికుంటు వ్యాధి సోకి పశువులు అల్లాడుతున్నాయి. పరడ పశువైద్యశాల నుంచి సకాలంలో వైద్య సేవలు అందడం లేదని, ఇప్పటికే కొన్ని దూడలు మృతి చెందాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, అధికారులు వెంటనే స్పందించి మేలైన వైద్యం అందించాలని బాధితులు కోరుతున్నారు.