MNCL: సామర్థ్యానికి మించి వాహనంలో పశువులను తరలిస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైపూర్ SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. కౌటాల నుంచి సిద్దిపేట సంతకు ఒకే వాహనంలో 8 ఆవులు, ఒక ఎద్దు, 5 దూడలను కిక్కిరిసిగా తరలిస్తుండగా, ఇందారం వద్ద రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. హోంగార్డు రమేశ్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.