SDPT: అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో 110 మంది రైతులకు కూరగాయల యూనిట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ మాలోతు మణి కనుకయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ జంగపల్లి ఐలయ్య రైతులకు సూచనలు చేశారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు, సేంద్రియ సాగు, ఆధునిక పద్ధతులు అవలంబిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు.