four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్ పేట పోలీస్ స్టేషన్లో భిక్షపతి అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. ఈ అంశంపై మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని పలువురు గిరిజనులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.