MHBD: రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అద్భుత ఫలితాలు సాధించి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు.