MHBD: నేడు (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది అందరూ మండల కేంద్రాల్లో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమై ఉండడంవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం కార్యాలయానికి రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.