JGL: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుపై ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లకు రైతుల నుంచి నష్టం జరిగితే ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు.