NRPT: అధునాతన సాంకేతికతతో కేటుగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్సై సతీశ్ రెడ్డి సూచించారు. శనివారం బోయిన్ పల్లిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు. మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.