NLG: మునుగోడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ పేద విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు నారబోయిన రవి మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీఐ రాములు, తహసీల్దార్ నరేష్, ఎస్సై రవి, సర్పంచ్ రమాదేవి తదితరులు పాల్గొని లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు.