SRPT: అనంతగిరి మండలం త్రిపురవరంలో మిషన్ భగీరథ పైప్లైన్ కోసం తవ్విన గుంతలను శనివారం రాత్రి గ్రామ పంచాయతీ సిబ్బంది పూడ్చివేశారు. గ్రామ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై గుంతల కారణంగా వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించి, తక్షణమే స్పందించి ఈ పనులు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు.