SDPT: బెజ్జంకి మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెలరోజులుగా మార్కెట్లో పంటకు కొనుగోలు లేక గూడెల్లి కొమురయ్య తన ఏడెకరాల పంటను ఇంటికి తీసుకెళ్లాడు. కేంద్రం కోటా ముగిసిందనే కారణంతో రాష్ట్రం కూడా కొనకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.