NRML: నేటి నుంచి ప్రారంభం కానున్న SSC పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ జిల్లా SP జానకి షర్మిల తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 నిబంధన అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.