RR: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భరత్ నగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ పేరుతో పేదల దుకాణాలను ఏకపక్షంగా తొలగించవద్దని అధికారులను ఆదేశించారు. జీవనాధారం కోల్పోయే నిరుపేదలకు ముందే ప్రత్యామ్నాయం చూపాలని ఆయన స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు.