ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల నూతన సర్పంచులకు ఇటీవల ఉట్నూరులో ప్రారంభమైన శిక్షణ తరగతులు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా ఉన్నతస్థాయి అధికారులు వారికి గ్రామపాలన, సంక్షేమ పథకాల అమలుతో పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లారావు తదితరులున్నారు.