KMM: మధిర మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి సోమవారం తెలిపారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబ్స్, ఉచిత బస్పాస్ సదుపాయాలు ఉన్నాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.