SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన భూములకు స్పష్టమైన హద్దులు నిర్ణయించాలని కోరుతూ, గ్రామ పాలకవర్గ సభ్యులు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ సుజాతను కలిసి వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో పంచాయతీకి సంబంధించిన భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటికి తగిన హద్దులు నిర్ణయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.