PDPL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంల తయారీపై జూలపల్లి మండల సమైక్య కార్యాలయంలో సోమవారం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. టీవోటీ ట్రైనర్ మసూద ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణను న్యాక్ సెంటర్ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. పలు గ్రామాల మహిళలు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీసీలు ఆనంద్, అనిత పాల్గొన్నారు. మహిళల స్వయం ఉపాధికి ఈ శిక్షణ తోడ్పడుతుందన్నారు.