WGL: ఖానాపురం(M) బుధరావుపేట గ్రామంలో ఇవాళ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శనివారం MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మహిళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో మొదటి ఏడాదిలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని తెలిపారు.