WGL: నర్సంపేట పట్టణంలో ప్రైవేటు వైద్యుడు, రేడియాలజిస్టు సతీశ్‌పై దాడి చేసిన మాజీ సర్పంచ్ సాగర్‌పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. సాగర్ స్కానింగ్ సెంటర్‌కు వచ్చినప్పుడే సతీశ్ అందుబాటులో లేని సమయంలో సిబ్బందితో దుర్భాషలాడి, వైద్యుడిని కొట్టడమే కాక అసభ్యకర పదాలతో దూషించాడు. సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.