MDK: నిజాంపేట మండలం తిప్పన్నగుల్లలో కాకతీయ శైలికి చెందిన పురాతన శివాలయాన్ని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం ‘ సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో శివలింగం లేకపోయినా, లతలు, సింహాలు, హంసల చెక్కడాలతో కూడిన మూడు గర్భద్వారాలు అద్భుతంగా ఉన్నాయి. శైవ ద్వారపాలకుల శిల్పాలు ఈ ఆలయ విశిష్టతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు.