NZB: ఆర్మూర్ మండలం గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆలూర్ మండలం మిర్దాపల్లిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణంతో గ్రామాల్లో విద్యుత్ సమస్య కనుమరుగవుతుందన్నారు.