ATP: మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఆదివారం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు. జిల్లా SP జగదీష్ ఆదేశాల మేరకు అన్ని సబ్ డివిజన్లలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 36 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.