TG: స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లేఖ రాశారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ నిరోధించాలన్నారు. గత పదేళ్లలో డ్రగ్స్ కల్చర్ చాలా పెరిగిపోయిందని తెలిపారు. కాగా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.