PPM: సకాలంలో అసంక్రమిత వ్యాధుల గుర్తింపు లక్ష్యంగా ఎన్.సి.డి సర్వే చేపట్టాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డా. టి. జగన్ మోహనరావు అన్నారు. ఈ మేరకు సర్వేకు సంబంధించి ముఖ్యమైన సూచనలు అయన చేశారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల దృష్ట్యా అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.