ADB: ఈనెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమై మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పాయల్ శంకర్ పేర్కొన్నారు.