MNCL: అరైవ్- అలైవ్ లో భాగంగా ఇవాళ కోటపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రియమైన నాన్నకు.. రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మా కోసం మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి.. నాకు, అమ్మకు కూడా హెల్మెట్లు తీసుకురండి.. అంటూ విద్యార్థులు వారి నాన్నలకు తమ లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు.