KMR: జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలు ఫేస్ రీడింగ్ విధానంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్, మొబైల్, కెమెరా సమస్యలు, సరైన వెలుతురు లేకపోవడంతో ముఖ గుర్తింపు నమోదు విఫలమవుతోంది. దీని వల్ల హాజరు నమోదు కాక, ఆదాయం కోల్పోతున్నామని, వేతనాలు సకాలంలో పడడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.